Logo
Download our app
మ‌హా కుంభ మేళా చిర‌స్మ‌ర‌ణీయం
NEWS   Mar 18,2025 02:58 pm
మహా కుంభమేళాపై లోక్‌సభలో ప్రధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మహా కుంభమేళా ఓ చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు.. కుంభమేళా దేశ ప్రజలను ఐక్యం చేసిందన్నారు. కోట్లాది మంది భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు చేశారని అన్నారు. మన శక్తి సామర్థ్యాలపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటా పంచలు చేసిందని చెప్పారు. మహా కుంభమేళాతో భారత్ శక్తిని ప్రపంచమంతా చూసిందన్నారు.. ఇది భవిష్యత్ తరాలకు ఓ ఉదాహరణగా నిలుస్తుంద‌న్నారు. 143 కోట్ల మంది భార‌తీయులు సాధించిన అపూర్వ‌మైన విజ‌య‌మ‌న్నారు పీఎం.
⚠️ You are not allowed to copy content or view source