Logo
Download our app
శ్యామలని వెంటనే సస్పెండ్ చేయాలి
NEWS   Mar 18,2025 02:44 pm
జ‌న‌సేన పార్టీ తిరుప‌తి ఇంఛార్జ్ కిర‌ణ్ రాయ‌ల్ నిప్పులు చెరిగారు. బెట్టింగ్ యాప్స్ ను ప్ర‌మోట్ చేసిన వైసీపీ అధికార ప్ర‌తినిధి, న‌టి శ్యామ‌ల‌ను వెంట‌నే స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆమెను బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్టాకే నేత‌లు, జ‌గ‌న్ మాట్లాడాల‌ని అన్నారు. ఆమెపై మర్డర్ కేసు కూడా పెట్టాలన్నారు. శ్యామల ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చని పోయార‌ని ఆరోపించారు. శ్యామల అధికార ప్రతినిధి వైసీపీ పార్టీకా లేకపోతే బెట్టింగ్ యాప్స్ కా అని ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source