Logo
Download our app
కామెంట్స్ చేస్తే కేసులు పెడ‌తారా..?
NEWS   Mar 18,2025 09:20 am
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కు డ‌బ్బులు పంపే ప‌నిలో రేవంత్ బిజీగా ఉన్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మీడియా పాయింట్ వ‌ద్ద చిట్ చాట్ చేసిన కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం కామెంట్స్ అన్నీ బ‌క్వాస్ అంటూ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source