Logo
Download our app
రేవ‌తి..తాన్య‌ల‌కు బెయిల్ మంజూరు
NEWS   Mar 17,2025 07:05 pm
రేవంత్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను కించ ప‌రిచేలా వీడియోలు పోస్ట్ చేశారంటూ జ‌ర్న‌లిస్ట్ రేవ‌తి, తాన్యాల‌ను అరెస్ట్ చేశారు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు. పోలీస్ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు తిర‌స్క‌రించింది. జ‌ర్న‌లిస్టుల‌కు బెయిల్ మంజూరు చేసింది. జ‌ర్న‌లిస్టుల త‌ర‌పున న్యాయ‌వాది కిర‌ణ్ కుమార్ వాద‌న‌లు వినిపించారు. పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించార‌ని ఆరోపించారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు రేవ‌తి, తాన్యాల‌ను కావాల‌ని అరెస్ట్ చేశారని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source