Logo
Download our app
రైతు కూలీ సంఘం ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా
NEWS   Mar 17,2025 06:36 pm
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ  రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఎం.డి హంజద్ పాషా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అవ‌లంభిస్తోంద‌ని ఆరోపించారు. జిల్లా లో రైతు సమస్య లు పేరుకు పోయాయ‌ని, రావాల్సిన బోన‌స్ ఇవ్వ‌లేద‌ని, వెంకటాపురం, వాజేడు గ్రామాలలో మొక్కజొన్న పంట రైతులు తీవ్రంగా న‌ష్ట పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పంట‌లు కోల్పోయిన రైతుల‌కు న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు పాషా.
⚠️ You are not allowed to copy content or view source