Logo
Download our app
పొట్టి శ్రీ‌రాములు పేరు మారిస్తే ఖ‌బ‌డ్దార్
NEWS   Mar 16,2025 05:33 pm
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పై భ‌గ్గుమ‌న్నారు. పొట్టి శ్రీ‌రాములు పేరు మార్చాల్సిన అవ‌స‌రం ఏముందంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న గొప్ప దేశ భ‌క్తుడని, స్వాతంత్ర స‌మ‌ర యోధుడ‌ని అన్నారు. ఆయ‌న బ‌లిదానం వ‌ల్ల‌నే భాషా ప్రాతిప‌దిక‌న ఆంధ్ర రాష్ట్రం ఏర్ప‌డిన విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. హరిజనోద్దరణ ఉద్యమం చేశారనే సంగతి మర్చి పోయారా అంటూ మండిప‌డ్డారు. ఆంధ్రా మూలాలు ఉంటే పేర్లు మార్చేస్తారా అని ఫైర్ అయ్యారు. అయితే ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను కూడా మార్చే దమ్ముందా అంఊట నిల‌దీశారు.
⚠️ You are not allowed to copy content or view source