Logo
Download our app
అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం
NEWS   Mar 16,2025 04:24 pm
కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి సంచ‌ల కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అది కూలేశ్వ‌ర‌మ‌ని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టించామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నాడని ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన ప్రాజెక్టులన్నీ ఎవరు కట్టించారో హరీశ్ రావు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ విసిరారు. పిల్ల కాకులతో నాకెందుకు.. అసలైన వాళ్లనే రావాల‌ని అన్నారు.ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదమో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పిన మాట ప్రకారం వరంగల్‌కు ఎయిర్‌పోర్టును సాధించి ఈ రోజు మీ ముందు నిలబడ్డాన‌ని అన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి పనులను చేసి చూపించామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source