Logo
Download our app
ఏప్రిల్ 3 నుండి శ్రీ ప‌ట్టాభిరామ స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు
NEWS   Mar 16,2025 09:59 am
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి.బ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని టీటీడీ పాల‌క మండ‌లి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా వ‌స‌తి సౌక‌ర్యాలు ఏర్పాటు చేయాల‌ని ఈవో జె. శ్యామ‌ల రావు ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source