Logo
Download our app
ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సీఎం దంప‌తులు
NEWS   Mar 16,2025 09:51 am
అమ‌రావతిలోని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దంప‌తులు స్వామి, అమ్మ వార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు.ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామ‌ల రావు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి , బోర్డు స‌భ్యులు, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source