Logo
Download our app
ప‌వ‌న్ స్పీచ్ కు మెగాస్టార్ ఫిదా
NEWS   Mar 15,2025 12:30 pm
చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం వేదిక‌గా జ‌రిగిన జ‌న‌సే పార్టీ జ‌య‌కేత‌నం ఆవిర్భావ స‌భ సంద‌ర్బంగా ఆ పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌సంగం అద్భుతం అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. శ‌నివారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నా పేర్కొన్నారు. నీ స్పీచ్ నాలో మ‌రింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌ని తెలిపారు. ఎంతో భావోద్వేగంతో నువ్వు మాట్లాడిన తీరు కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తుంద‌న్నారు. ఇవాళ నిన్ను చూసి మెగా కుటుంబం గ‌ర్వ ప‌డుతోంద‌న్నారు .
⚠️ You are not allowed to copy content or view source