Logo
Download our app
దేశంలో ఏపీని నెంబ‌ర్ వ‌న్ గా చేస్తా
NEWS   Mar 15,2025 12:13 pm
ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో ఏపీ రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్ చేస్తాన‌ని అన్నారు. నా చివరి రక్తం బొట్టు వరకు పేదవాడికి సాయం చేయాలన్నదే త‌న ఏకైక సంక‌ల్పంమ‌న్నారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛంద్ర దిశగా అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. 47 ఏళ్ల క్రితం ఇదే రోజు అసెంబ్లీలోకి తొలిసారి అడుగు పెట్టాన‌ని గుర్తు చేసుకున్నారు సీఎం. సుదీర్ఘ కాలం పాటు సీఎంగా ప‌ని చేశాన‌ని, ఈ అవ‌కాశం ప్ర‌జ‌ల‌తో పాటు ఆ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ల్పించాడ‌ని అన్నారు. మ‌రోసారి సీఎంగా ప‌ని చేసే ఛాన్స్ ద‌క్కింద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు హాయిగా బ‌త‌కాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు.
⚠️ You are not allowed to copy content or view source