Logo
Download our app
తెలంగాణ సెక్రటేరియేట్ పై డ్రోన్
NEWS   Mar 15,2025 12:08 pm
అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ నిర్వ‌హిస్తున్న తెలంగాణ స‌చివాల‌యంపై కొంద‌రు ఆగంత‌కులు డ్రోన్ ను ఎగుర వేశారు. మార్చి 11న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ విష‌యాన్ని సైఫాబాద్ పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. డ్రోన్ ఎగుర వేసిన ఇద్ద‌రిని గుర్తించారు. వంశీ, నాగ‌రాజును అదుపులోకి తీసుకున్నారు. కాగా విచార‌ణ‌లో డ్రోన్ కెమెరాతో సెక్రటేరియట్ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా చిత్రీక‌రించిన‌ట్లు ఒప్ప‌కున్న‌ట్లు స‌మాచారం.
⚠️ You are not allowed to copy content or view source