Logo
Download our app
ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్ ఫాలో చేయండి
NEWS   Mar 15,2025 11:33 am
ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయాల‌ని పిలుపునిచ్చారు. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టాల‌ని సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించాల‌ని పేర్కొన్నారు.ఓ ఛానల్ లో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ఇంటర్వ్యూ ఇవ్వ‌డంపై మండిప‌డ్డారు. తను బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. చేస్తున్నదే తప్పు..అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలై పోతున్నా క‌నీసంం ప‌శ్చాతాపం చెంద‌క పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source