Logo
Download our app
ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు నేను సేవ‌కుడిని
NEWS   Mar 15,2025 09:23 am
ఎమ్మెల్సీ నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను నాయ‌కుడు కాద‌ని , కేవ‌లం సేవ‌కుడిని మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జ‌రిగిన జ‌న‌సేన పార్టీ జ‌య‌కేత‌నం ఆవిర్భావ స‌భ‌లో ప్ర‌సంగించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అని ప్ర‌శంసించారు. తాను, త‌న సోద‌రుడు చిరంజీవి, కుటుంబం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అంద‌నంత ఎత్తుకు ఎదిగాడ‌ని అన్నారు. వీలైతే ప‌వ‌న్ స్థాయికి ఎదిగేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. లేదంటే అంత గొప్ప వ్య‌క్తికి సేవ‌కుడిగా ఉండాల‌న్నారు. తాను ప‌వ‌న్ అంత ఎత్తుకు ఎదిగే సామ‌ర్థ్యం లేద‌ని, అందుకే సేవ‌కుడిగా ఉండి పోయాన‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source