ఐపీఎల్ కు జస్ప్రీత్ బుమ్రా దూరం
NEWS Mar 15,2025 07:43 am
ముంబై ఇండియన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 22 నుంచి టాటా ఐపీఎల్ బిగ్ టోర్నీ ప్రారంభం కానుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు. తను గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధ పడుతున్నాడు. ఇంకా ఆ గాయం మానలేదు. ఇబ్బంది పెడుతుండడంతో తను ఆడలేక పోతున్నానని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో స్పీడ్ స్టర్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇదిలా ఉండగా జట్టులోకి రావాలంటే ముందుగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.