Logo
Download our app
మ‌హ‌మ్మ‌ద్ అజహ‌రుద్దీన్ కు అస్వ‌స్థ‌త..?
NEWS   Mar 14,2025 10:30 pm
భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్ లోని బంజారా హిల్స్ కింగ్ స్ట‌న్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం గ్గూకోజ్ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నార‌ని, వైద్యుల ప‌ర్యవేక్ష‌ణ‌లో ఉన్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అజ‌హ‌రుద్దీన్ ఆస్ప‌త్రి పాల‌య్యార‌ని తెలియగానే అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అజ్జూ భాయ్ కి ఇండియాలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source