Logo
Download our app
అసెంబ్లీని కౌర‌వ స‌భ లాగా మార్చిన కాంగ్రెస్
NEWS   Mar 14,2025 05:00 pm
కాంగ్రెస్ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్. గతంలో అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో ప్రజలు చూసే వాళ్ల‌న్నారు. కానీ ప్ర‌స్తుతం అసెంబ్లీని కౌర‌వ స‌భ లాగా మార్చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ను మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కావాల‌ని అవ‌మానించ లేద‌న్నారు. ఎక్క‌డ నిల‌దీస్తారోన‌నే భ‌యంతోనే వేటు వేశార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆనాడు త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ లేద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ మాట్లాడేందుకు ఛాన్స్ ఇచ్చామ‌న్నారు మాజీ మంత్రి.
⚠️ You are not allowed to copy content or view source