Logo
Download our app
కేటీఆర్ దీక్ష చేప‌డ‌తాన‌న‌డం విడ్డూరం
NEWS   Mar 14,2025 01:02 pm
ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న మాజీ మంత్రి కేటీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. త‌ను ఆమ‌ర‌ణ దీక్ష చేప‌డ‌తానంటూ ప్ర‌క‌టించ‌డంపై స్పందించారు. ఇది విడ్డూరంగా ఉంద‌న్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ ద‌ళితుల‌ను గౌర‌వించిన పాపాన పోలేద‌న్నారు. అందుకే వారిని జ‌నం న‌మ్మ‌లేద‌న్నారు. ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్ ను ఉద్దేశించి. ఆనాడు నామ మాత్రంగా తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం ని చేసి కొన్ని రోజులకే పదవి నుంచి తీసేశారని ఆరోపించారు. ప్రణబ్ ముఖర్జీ వస్తే కాళ్లకు దండం పెట్టిన కేసీఆర్, రామ్ నాథ్ కోవింద్ వస్తే కనీసం పట్టించు కోలేదన్నారు. ఇది దొర మ‌న‌స్త‌త్వానికి, అహంకార పూరిత ధోర‌ణికి నిద‌ర్శ‌న‌మ్నారు ఎంపీ.
⚠️ You are not allowed to copy content or view source