Logo
Download our app
న‌ర‌సింహ్మ స్వామి స‌న్నిధిలో లోకేష్
NEWS   Mar 14,2025 10:48 am
ఏపీలోని మంగ‌ళ‌గిరి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో బ్ర‌హ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌లో బాగంగా స్వామి వారి క‌ళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్, భార్య నారా బ్రాహ్మ‌ణి స్వామి, అమ్మ వార్ల‌కు ప్ర‌త్యేకంగా ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఆల‌య క‌మిటీ చైర్మ‌న్, స‌భ్యులు , పూజారులు లోకేష్ దంప‌తుల‌కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. క‌ళ్యాణోత్స‌వం సంద‌ర్భంగా భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source