Logo
Download our app
చంద్ర‌బాబుతో డీఆర్డీఓ మాజీ చైర్మ‌న్ భేటీ
NEWS   Mar 14,2025 10:09 am
డీఆర్డీఓ మాజీ చైర్మ‌న్, ఏరోనాటిక‌ల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ జి. స‌తీష్ రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధి, ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో పరిశ్రమలు నెలకొల్పటానికి గల అవకాశాల గురించి ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్, అమలాపురం ఎంపీ హరీష్ పాల్గొన్నారు. అంతకు ముందు విజ‌య‌వాడ‌లో దాదాపు 50 మంది పారిశ్రామికవేత్తలతో సతీష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలలో పరిశ్రమలు నెలకొల్పటానికి గల అనుకూలతలపై చర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source