Logo
Download our app
నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్
NEWS   Mar 14,2025 04:40 pm
యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) ఏర్పాటు చేయాలని సంకల్పించిందని ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో 70 ఏటీసీ కేంద్రాల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఐటిఐ, ఏటీసీ సెంటర్లు లేని ప్రతి గ్రామీణ అసెంబ్లీ సెగ్మెంట్ లో కనీసం ఒకటి చొప్పున అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source