Logo
Download our app
బెట్టింగ్ యాప్ లతో అప్రమత్తంగా ఉండాలి
NEWS   Mar 14,2025 04:41 pm
సోషల్ మీడియాల ద్వారా వచ్చే లోన్‌ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లను నమ్మి మోస పోవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినట్లు దృష్టికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నేటి యువత బెట్టింగ్ యాప్‌ల బారినపడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source