Logo
Download our app
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం
NEWS   Mar 13,2025 07:34 pm
ఏపీలో ఎమ్మెల్యేల కోటా కింద జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఐదుగురు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ విష‌యాన్ని శాస‌న మండ‌లి స్పీక‌ర్ , కార్య‌ద‌ర్శి వెల్ల‌డించారు. టీడీపీ నుంచి బీటీ నాయుడు, బీద ర‌విచంద్ర‌, కావ‌లి గ్రీష్మ , జ‌న‌సేన నుంచి కొణిద‌ల నాగ‌బాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా నూత‌న ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్య‌ర్థుల‌ను అభినందించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.
⚠️ You are not allowed to copy content or view source