Logo
Download our app
శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తాం
NEWS   Mar 13,2025 06:11 pm
అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. సీఎం చంద్ర‌బాబు ఆకాంక్ష మేరకు శ్రీనివాస కళ్యాణం అనంతరం స్వామి వారి దివ్య ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. మొదటి విడతగా రూ. 30 వేల కోట్లతో పనులు ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం జ‌ర‌గ‌డం ఆనందంగా ఉందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source