Logo
Download our app
కోరుట్ల‌లో న‌గ‌దు..బంగారం చోరీ
NEWS   Mar 13,2025 06:34 pm
కోరుట్ల పట్టణంలోని రాంనగర్ లో ఐలాపూర్ పద్మ అనే మహిళ ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. వచ్చి చూసేసరికి ఇంట్లోని వస్తువులు చిందర వందరగా ప‌డ‌టం, బీరువాను దొంగలు ధ్వంసం చేసినట్టు గుర్తించారు. నాలుగు లక్షల నగదు రెండు తులాల బంగారం చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాంచంద్రం, క్లూస్ టీం అధికారులు ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source