Logo
Download our app
జ‌గ‌దీశ్ రెడ్డి కామెంట్స్ అద్దంకి సీరియ‌స్
NEWS   Mar 13,2025 02:05 pm
అసెంబ్లీలో స్పీక‌ర్ ను ఉద్దేశించి మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థి అద్దంకి ద‌యాక‌ర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న స్పీక‌ర్ ప‌ట్ల చుల‌క‌న భావంతో మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాజ్యాంగం, గవర్నర్, స్పీకర్, సభ పట్ల సోయి లేని వ్యక్తులను కేసీఆర్ మంత్రులను చేశాని, ప్రభుత్వాన్ని అడ్డ‌గోలుగా న‌డిపాడ‌ని ఆరోపించారు. ఇలాంటి వాళ్ల వల్ల బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లినా ఇంకా తెలిసి రావడం లేద‌న్నారు. ఇది రాజకీయ సంస్కృతి కాదన్నారు ఎమ్మెల్యే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్. వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source