Logo
Download our app
ఆర్మీ ఆఫ‌ర్ 13 జిల్లాల అభ్య‌ర్థుల‌కు ఛాన్స్
NEWS   Mar 13,2025 10:44 am
ఏపీలోని 13 జిల్లాల అభ్య‌ర్థుల‌కు బంప‌ర్ ఛాన్స్ ఇచ్చింది ఆర్మీ. గుంటూరు లోని ఆర్మీ చీఫ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలోని 13 జిల్లాల‌కు చెందిన అభ్య‌ర్థుల కోసం అగ్నివీర్ సిబ్బందికి సంబంధించి నియామ‌కాలు చేప‌ట్టామ‌న్నారు. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 2025-26 వ‌ర‌కు నమోదు ప్రారంభించామ‌న్నారు. నమోదుకు చివరి తేదీ 10 ఏప్రిల్ అని పేర్కొన్నారు. ఒక అభ్యర్థి ఇప్పుడు రెండు వేర్వేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకునే అవ‌కాశం కూడా క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source