Logo
Download our app
హైద‌రాబాద్ లో రంగులు చ‌ల్లితే ఖ‌బ‌డ్దార్
NEWS   Mar 13,2025 09:58 am
హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అవినాష్ మ‌హంతి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 14న శుక్ర‌వారం హోలీ పండుగ సంద‌ర్బంగా నియ‌మ నిబంధ‌న‌లు విధించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. న‌గ‌ర‌వాసులు వీటిని తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఇందు కోసం ఉద‌యం 6 గంట‌ల నుంచి 15వ తేదీ శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు ఆంక్ష‌లు విధించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు సీపీ. హోలీ పండుగ సంద‌ర్బంగా రోడ్డు మీద వెళ్లే వారిపై ప‌నిగ‌ట్టుకుని రంగులు చ‌ల్లితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source