Logo
Download our app
హెచ్ఎండీఏ ప‌రిధిని విస్త‌రించిన స‌ర్కార్
NEWS   Mar 13,2025 09:23 am
తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్ మెట్రో పాలిటిన్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప‌రిధిని విస్తరించింది. ఈ మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ ప‌రిధిలోకి మ‌రో 36 రెవెన్యూ గ్రామాలు చేరుస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇక హెచ్ఎండీఏ ప‌రిధి పెర‌గ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1355 గ్రామాలు, 104 మండ‌లాలు, 11 జిల్లాలు ఉన్నాయి. ఇక పై 10 వేల 472.72 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది హెచ్ఎండీఏ ప‌రిధి.
⚠️ You are not allowed to copy content or view source