Logo
Download our app
నారాయ‌ణ విద్యాసంస్థ‌ల కిచెన్ అధ్వాన్నం
NEWS   Mar 12,2025 01:58 pm
హైద‌రాబాద్: కుంట్లూరులోని నారాయ‌ణ విద్యా సంస్థ‌ల సెంట్ర‌ల్ కిచెన్ పై రైడ్ చేశారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కుల్లిపోయిన టమాటో, ఆలు తో పాటు ఇతర కూరగాయలను వాడుతున్న‌ట్లు తేలింది. తుప్పు పట్టిన కత్తులతో కూరగాయల కటింగ్ చేస్తున్నార‌ని, ఈగలు, బొద్దింకలు కిచెన్ లో తిరుగుతున్నాయని తెలిపారు ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్స్. ఇక్కడ వండిన ఫుడ్ ని నారాయణ విద్యాసంస్థల హాస్టల్స్ లో విద్యార్థులకు వడ్డిస్తున్నారు నిర్వాహ‌కులు. లైసెన్స్ లేకుండా తొమ్మిది వెహికిల్స్ లో ఫుడ్ ని చేర వేస్తున్నార‌ని గుర్తించామ‌ని, నారాయణ సెంట్రల్ కిచెన్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామ‌ని వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source