Logo
Download our app
కేసీఆర్..కేటీఆర్ పై పీసీసీ చీఫ్ ఫైర్
NEWS   Mar 12,2025 05:39 pm
పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ల‌కు అహంకారం ఇంకా త‌గ్గ లేద‌న్నారు. గవర్నర్ ప్రసంగం పై కేటీఆర్ చిన్న పిల్లాడిలా కామెంట్స్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. గవర్నర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మహిళ గవర్నర్ తమిళ సై సౌంద‌ర రాజ‌న్ విషయంలో వ్యంగ్యంగా గతంలో బిఅరెస్ సభ్యులు మాట్లాడిన తీరు ఇంకా ప్ర‌జ‌లు మ‌రిచి పోలేద‌న్నారు. సభలో గవర్నర్ ఎలా మాట్లాడ్తారో ఇంగిత జ్ఞానం లేక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source