Logo
Download our app
19న అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్
NEWS   Mar 12,2025 02:29 pm
రాష్ట్ర ప్ర‌భుత్వం ఈనెల 19న అసెంబ్లీలో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఈనెల 27 వ‌ర‌కు అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని బీఏసీలో నిర్ణ‌యం తీసుకున్నారు. 14న హోళీ పండుగ సంద‌ర్బంగా సెలవు ఉంటుంద‌ని తెలిపారు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్. 15న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ జ‌రుగుతుంద‌న్నారు. 17న ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చ‌ట్ట బ‌ద్ద‌త‌పై చ‌ర్చ‌, 18న బీసీ కుల‌గ‌ణ‌న‌, రిజ‌ర్వేష‌న్ల‌పై చ‌ర్చ‌, 21న బ‌డ్జెట్ పై పూర్తి స్థాయి చ‌ర్చ జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు స్పీక‌ర్.
⚠️ You are not allowed to copy content or view source