Logo
Download our app
గవర్నర్ అంటే గౌరవం లేదు
NEWS   Mar 12,2025 02:15 pm
బీఆర్ఎస్ నేత‌లపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్. అసెంబ్లీలో హుందాగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఎమ్మెల్యేలు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ప‌దే ప‌దే అడ్డు త‌గ‌ల‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. గ‌వ‌ర్న‌ర్ అంటే గౌర‌వం లేద‌ని, స్పీక‌ర్ అంటే లెక్కే లేద‌న్నారు. త‌మ నాయ‌కుడు సీఎం రేవంత్ రెడ్డికి వ‌స్తున్న జ‌నాద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక పోతున్నార‌ని ఆరోపించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌కుండా కుట్ర‌లు చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. రైతుల‌పై కేసీఆర్ మొస‌లి క‌న్నీరు కారుస్తున్నాడ‌ని పైర్ అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source