Logo
Download our app
కాళ్లకు సంకెళ్లు వేసి వెట్టిచాకిరీ
NEWS   Mar 13,2025 04:34 pm
బోధన్ పోలీస్ స్టేషన్లో అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది.ఓ కేసులో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి కాళ్లకు సంకెళ్లు వేసి వెట్టిచాకిరీ చేయించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు బాధ్యుడైన హెడ్ కానిస్టేబుల్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోధన్ పట్టణ శివారులోని బిలాలకు చెందిన యువకుడిని దొంగతనం కేసు లో పోలీస్ స్టేషన్‌కు తెచ్చారు. యువకుడు పారి పోకుండా ఉండేందుకు పోలీసులు అతని కాళ్లకు సంకెళ్లు వేశారు.అతనితోనే స్టేషన్ ఆవరణలో వెట్టి చాకిరీ పనులను చేయించారు.
⚠️ You are not allowed to copy content or view source