Logo
Download our app
ప్రభుత్వ అవినీతిపై చీల్చి చెండాడాలి
NEWS   Mar 11,2025 06:56 pm
బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ అవినీతిపై యుద్దం ప్ర‌క‌టించాల‌ని అన్నారు. త‌న అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన బిఆర్ ఎస్‌ఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చారు. త‌ప్పుడు నింద‌ల‌ను తిప్పి కొట్టాల‌న్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు..ఎండిన పంటలు, అందని కరెంటు, సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరత పై అసెంబ్లీ లో, మండలి లో పోరాడాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source