Logo
Download our app
హోం శాఖ‌కు రూ. 8570.50 కోట్లు
NEWS   Mar 11,2025 04:19 pm
హోంశాఖకు నిధుల గురించి హోం మంత్రి అనిత ప్రతిపాదించారు. 10వ డిమాండ్ కింద హోంశాఖకు రూ.8570.50 కోట్లు 2025-26 ఏడాదికిగానూ ఇవ్వాలని కోరారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల‌ని కోరారు ఎమ్మెల్యేలు కాల్వశ్రీనివాసులు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్లే ప్రజలు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓట్లేశారని అన్నారు. సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సహా ప్రతి ఒక్కరిపైనా గత ప్రభుత్వంలో అక్రమ కేసులు న‌మోదు చేశార‌ని ఆరోపించారు అనిత‌.
⚠️ You are not allowed to copy content or view source