Logo
Download our app
హంద్రీ నీవాను ప‌ట్టించుకోని స‌ర్కార్
NEWS   Mar 11,2025 01:05 pm
మంత్రి నిమ్మ‌ల రామానాయుడు నిప్పులు చెరిగారు. గ‌త వైసీపీ జ‌గ‌న్ స‌ర్కార్ కావాల‌ని ప్రాజెక్టుల‌ను నిర్ల‌క్ష్యం చేసింద‌ని ఆరోపించారు. 2014-19 లో హంద్రీ నీవా కోసం రూ. 5 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తే 2019-24 వైసీపీ హ‌యాంలో కేవ‌లం రూ. 500 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. గత ప్రభుత్వం హంద్రీనీవా పనుల మాట అటుంచి కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాయులు పెట్టిందని ఆరోపించారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన 3850 క్యూసెక్కులు సామర్థ్యం ఉన్న మోటార్లను కుడా గత ప్రభుత్వం ఉపయోగించు కోలేక పోయింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source