Logo
Download our app
ఆకస్మికంగా త‌నిఖీ చేసిన పోలీస్ క‌మిష‌న‌ర్
NEWS   Mar 11,2025 09:18 am
వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌న్ ప్రీత్ సింగ్ ఝ‌ల‌క్ ఇచ్చారు. ఆయ‌న రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు, రికార్డ్ గదులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల సమాచారం, స్టేషన్ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను సీపీ అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవ‌ర‌ణ‌లో మొక్కల పెంపకం చేప‌ట్ట‌డం ప‌ట్ల పోలీసుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. సీపీ వెంట డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ భీం శర్మ, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వున్నారు.
⚠️ You are not allowed to copy content or view source