Logo
Download our app
హైద‌రాబాద్ లో కుటుంబం సూసైడ్
NEWS   Mar 11,2025 09:04 am
హైద‌రాబాద్ లోని హ‌బ్సిగూడ‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి..ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు దంప‌తులు. మృతులు చంద్రశేఖర్ రెడ్డి, భార్య కవిత, కూతురు శ్రీత రెడ్డి (9వ తరగతి), కుమారుడు విశ్వన్ రెడ్డి (5వ తరగతి)గా గుర్తించారు పోలీసులు. గతంలో నారాయణ కాలేజీలో లెక్చరర్ గా పని చేశాడు మృతుడు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. గ‌త ఆరు నెల‌లుగా జాబ్ లేక తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల‌నే సూసైడ్ చేసుకున్న‌ట్లు అనుమానిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source