విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
NEWS Mar 11,2025 08:38 am
మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. సీఐడీ నోటీసులు జారీ చేసింది. తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో తనపై కేసు నమోదైంది. ఈ సందర్బంగా నోటీసు అందజేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా గత వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ హయంలో కీలక పాత్ర పోషించారు. అధికారం ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా వారి కుటుంబాన్ని ఏకి పారేస్తూ వచ్చారు.