Logo
Download our app
SRSP ఆఫీసు వ‌ద్ద రైతుల ఆందోళన
NEWS   Mar 11,2025 10:28 am
మెట్‌పల్లి: అయిలాపూర్ గ్రామానికి చెందిన రైతులు మెట్‌పల్లి పట్టణంలోని ఎస్సారెస్పీ ఆఫీసు వ‌ద్ద ఆందోళన చేపట్టారు. D36 కెనాల్‌కు మధ్యలో గండికొట్టి నీటిని అక్రమంగా తీసుకుంటున్నారని అన్నారు. దీంతో కింది ఆయకట్టు వరకు నీరు అందడం లేదని వాపోయారు. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు చేతికొచ్చే సమయానికి నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు.
⚠️ You are not allowed to copy content or view source