Logo
Download our app
ఇళ్ల ల‌బ్దిదారుల‌కు ఖుష్ క‌బ‌ర్
NEWS   Mar 10,2025 08:29 pm
ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారిధి వెల్ల‌డించారు. ఈ మేరకు జీవో జారీ చేశామ‌న్నారు. ఎస్సీ, బీసీ లబ్దిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్దిదారులకు రూ.75 వేలు , పివిటీజీలకు రూ.1.00 లక్షల అదనపు ఆర్థిక సహాయం అంద జేయడం జరుగుతుందన్నారు. పిఎమ్ఏవై (అర్బన్) బిఎల్సీ-1.0, పిఎమ్ఏవై (గ్రామీణ్) -1.0, పి.ఎం.జన్మన్ పథకాల క్రింద ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్దిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source