Logo
Download our app
ప్ర‌ణ‌య్ హ‌త్య కేసులో సంచ‌ల‌న తీర్పు
NEWS   Mar 10,2025 05:50 pm
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వెలువ‌రించింది కోర్టు. ఏ-2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది ఎస్సీ ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం. మిగ‌తా నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. 302, 120బై ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధిస్తున్న‌ట్లు తెలిపింది. కాగా హార్ట్ పేషేంట్స్, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, చిన్న పిల్లలు.. వంటి కారణాలు చూపుతూ శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు నేర‌స్థులు.
⚠️ You are not allowed to copy content or view source