Logo
Download our app
త్వ‌ర‌లో మ‌రిన్ని ప‌రీక్ష‌ల ఫ‌లితాలు
NEWS   Mar 10,2025 05:42 pm
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సోమ‌వారం కీల‌క‌మైన గ్రూప్ -1 మెయిన్స్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే మ‌రికొన్ని ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను డిక్లేర్ చేస్తామ‌ని తెలిపారు టీజీపీఎస్సీ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం. మంగ‌ళవారం గ్రూప్-2 ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌తో పాటు ఈనెల 14న గ్రూప్ -3, 17న హాస్ట‌ల్ వెల్ఫేర్ , 19న ఎక్స్టెన్స‌న్ ఆఫీస‌ర్ల రిజ‌ల్ట్స్ విడుద‌ల చేస్తామ‌న్నారు. ఈనెల 20న అన్ని పోటీ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source