Logo
Download our app
శ్రీ చైత‌న్య కాలేజీల్లో ఐటీ సోదాలు
NEWS   Mar 10,2025 05:33 pm
శ్రీ చైత‌న్య కాలేజీల యాజ‌మాన్యానికి బిగ్ షాక్ త‌గిలింది. దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీ చైత‌న్య కాలేజీల‌లో ఐటీ అధికారులు దాడులు చేప‌ట్టారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు లో సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని టాక్స్ ఎగవేశారని పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ యాప్ ను కూడా తీసుకొచ్చార‌ని, వాటి ద్వారా డ‌బ్బులు క‌ట్ట‌కుండా మోసం చేశార‌ని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source