Logo
Download our app
అసెంబ్లీకి రానున్న కేసీఆర్
NEWS   Mar 10,2025 03:26 pm
బీఆర్ఎస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆ పార్టీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ శాస‌న స‌భ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతార‌ని వెల్ల‌డించింది. ఎల్లుండి జ‌రిగే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతార‌ని, ఈ సంద‌ర్బంగా జ‌రిగే ధ‌న్య‌వాద తీర్మానంలో పాల్గొంటార‌ని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కొంద‌రు త‌మ‌ను తాము గొప్ప‌వాళ్ల‌మ‌ని భావిస్తున్నార‌ని, కానీ వారికి జ‌నంలో అంత ఆద‌ర‌ణ లేద‌ని గుర్తిస్తే మంచిద‌న్నారు. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని అన్నారు. కేసీఆర్ స్థాయికి స‌రితూగే మొన‌గాడు, నాయ‌కులు ఈ రాష్ట్రంలో లేర‌న్నారు. ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.
⚠️ You are not allowed to copy content or view source