బాలుడిపై కత్తితో దాడి.. అనంతరం
పరారీ
NEWS Mar 10,2025 02:12 pm
MBNR: నవాబుపేట మండలంలో దారుణం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విజయ్ కుమార్ పై అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు 108 సిబ్బంది ద్వారా మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రం తెలిపారు.