Logo
Download our app
టీమిండియా టార్గెట్ 252 ర‌న్స్
NEWS   Mar 09,2025 06:07 pm
దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ముందు ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ 252 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 251 ప‌రుగులు చేసింది. భార‌త స్పిన్న‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీవీస్ కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్ దీప్ యాద‌వ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చెరో 2 వికెట్లు తీశారు. ర‌వీంద్ర జ‌డేజా, ష‌మీ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. కీవీస్ టీమ్ లో మిచెల్ 63 ర‌న్స్ చేస్తే బ్రేస్ వెల్ 53 ర‌న్స్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source