Logo
Download our app
డిజిట‌ల్ లిట‌ర‌సీ అత్యంత అవ‌స‌రం
NEWS   Mar 09,2025 12:59 pm
సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి ఒక్క‌రికి ఆర్థిక అక్ష‌రాస్య‌త‌తో పాటు డిజిట‌ల్ సాంకేతిక‌త ప‌ట్ల నైపుణ్యం అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. సమాజంలో తమ వృత్తుల్లో ఆరితేరిన నిపుణులు సైతం సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సైబర్ నేరగాళ్లు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో మనకు తెలిసే అవకాశం ఉండదన్నారు. వాళ్లకు రూపు రేఖలే కాదు, హృదయంలో ఏమాత్రం దయ అన్నది ఉండదన్నారు. అందుకని ప్రతి ఒక్కరికీ డిజిటల్ సాంకేతికతపై అవగాహన, పర్యవేక్షణ ఉండాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source