Logo
Download our app
పంచాగాన్ని ఆవిష్క‌రించిన టీటీడీ చైర్మ‌న్
NEWS   Mar 09,2025 12:41 pm
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవ‌త్స‌ర పంచాంగాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆవిష్క‌రించారు. ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్త లోకానికి అందిస్తున్న విషయం తెలిసిందే. అదే ప్ర‌కారం ఈ ఏడాది కూడా నూత‌న సంచాంగాన్ని భ‌క్తుల‌కు అందిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది.
⚠️ You are not allowed to copy content or view source